ఉషోదయ ఎన్‌క్లేవ్ ఫేజ్ 2 లో బాలింగ్ గౌతమ్ గౌడ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ ప‌రిధిలోని ఉషోదయ ఎన్‌క్లేవ్ ఫేజ్‌ 2 అసోసియేషన్ ప్రతినిధులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్  ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాలనీ వాసులతో రోడ్ల పరిమితులు, యు జి డి పైప్ లైన్, పార్క్ లోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here