నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. పదిరోజుల గడువుతో ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ ఐదురోజులు పొడగించిన విషయం విదితమే. ఐతే శుక్రవారంతో ముగియాల్సిన సుపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ఆదివారం సైతం కొనసాగనుందని సమాచారం. మరో మూడు రోజులు గడువు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా శుక్రవారం చందానగర్ పీజేఆర్ స్టేడియంలో 18 ఏళ్లు పైబడిన వారు 993 మంది, 18 ఏళ్లు పైబడిన వారు 205 కలిపి మొత్తం 1198 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. సర్కిల్ పరిధిలోని చెత్త సేకరించే ఆటో రిక్షా కార్మికులు 113 మందికి ప్రత్యేకంగా టీకాలు వేశారు. శానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం సైతం ఈ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో 18 ఏళ్లు పైబడిన వారు 1200 మంది, 18 ఏళ్లు పైబడిన వారు 241 కలిపి మొత్తం 1441 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కొండాపూర్‌లోని జిల్లా దవాఖానాలో 20 మందికి కోవిషీల్డ్ రెండవ డోసు టీకా ఇచ్చినట్టు సుపరింటెండెంట్ వరదాచారి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సైతం కోవాక్జిన్, కోవిషీల్డ్ రెండవ డోసు పంపిణీ జరుగుతుందని తెలిపారు. మొదటి డోసు తీసుకుని 28 రోజులు(కోవాక్జీన్), 84 రోజులు(కోవీషీల్డ్) గడువు ముగిసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.