శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న మహా అన్నదాన కార్యక్రమం 10వ వారానికి చేరుకుంది. ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు నేతృత్వంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో నిరుపేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ సమాజ సేవే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, శ్రీరాములు, పాండు, వినీత్, సుధాకర్, శోభారాణి, స్వప్న, హర్షిణి, కల్పన, కవిత, భావన, సుజాత, అరుణ, నర్మద, పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.






