గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్‌లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన వికలాంగురాలు రేణుకకు ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ శనివారం కుట్టు మిషన్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సహాయం చేసేందుకు హోప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఎప్పటికప్పుడు సామాజిక కార్యక్రమాలను తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాకేష్, సయ్యద్ ఖాసీం, స్థానికులు పాల్గొన్నారు.
