శేరిలింగంప‌ల్లిలో శుక్ర‌వారం విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ సబ్‌స్టేష‌న్ ప‌రిధిలో శుక్ర‌వారం ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విద్యుత్ నిర్వ‌హ‌ణ ప‌నుల నిమిత్తం ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌, హుడా కాల‌నీ, శాంతిన‌గ‌ర్‌, ఇందిరా న‌గ‌ర్‌, చందాన‌గ‌ర్‌, లింగంపల్లి, మార్కెట్‌, తారాన‌గ‌ర్‌, ఎస్ఎం లే అవుట్‌, ఓల్డ్ లింగంప‌ల్లి, రైతు బ‌జార్‌, లింగంప‌ల్లి పోలీస్ స్టేష‌న్, హుడా ట్రేడ్ సెంట‌ర్‌, రైల్ విహార్‌, శివాజీన‌గ‌ర్, కానుకుంట‌, రామ‌య్య కాల‌నీ, వెంక‌ట్ రెడ్డి కాల‌నీల‌లో క‌రెంటు ఉండ‌ద‌ని తెలిపారు.

న‌ల్ల‌గండ్ల‌లో…
న‌ల్ల‌గండ్ల స‌బ్‌స్టేష‌న్ 11కేవీ ఎపిస్టోమ్ గ్లోబ‌ల్ ఫీడ‌ర్ ప‌రిధిలో శుక్ర‌వారం ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేయ‌నున్నారు. క‌రెంటు తీగ‌ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గిస్తున్న నేప‌థ్యంలో తెల్లాపూర్ రోడ్డు, అబోడ్ అపార్ట్‌మెంట్స్‌, తెల్లాపూర్ న‌ర్స‌రీల‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు లేక్ వ్యూ ఫీడ‌ర్ ప‌రిధిలోని తెల్లాపూర్ రోడ్డు, సాధ‌న స్కూల్ వెనుక వైపు, ఎపిస్టోమ్ గ్లోబ‌ల్ స్కూల్‌, రాక్ పార్క్ సైడ్ ల‌లో క‌రెంటు ఉండ‌ద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here