నేడు విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

శేరిలింగంప‌ల్లి, జూన్‌15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యుత్ మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా హైద‌ర్‌న‌గ‌ర్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు ఏఈ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 33/11 కేవీ హెచ్ఎంటీ హిల్స్ స‌బ్ స్టేష‌న్ 11 కేవీ సెవెన్ హిల్స్ ఫీడ‌ర్ ప‌రిధిలో సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్స్‌, నాగార్జున హోమ్స్‌, నిజాంపేట రోడ్డు ప్రాంతాల్లో ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌ని తెలిపారు. 33/11 కేవీ మ‌యూరి న‌గ‌ర్ స‌బ్ స్టేష‌న్ 11 కేవీ ల‌క్ష్మీన‌గ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలో ల‌క్ష్మీ న‌గ‌ర్‌, దోవా కాల‌నీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రోడ్డు, న‌మ‌హా అపార్ట్‌మెంట్స్‌, బుద్ధ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు క‌రెంటు ఉండ‌ద‌ని తెలిపారు. వినియోగ‌దారులు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here