PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన సగర (ఉప్పర) సంఘం స‌భ్యులు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జగద్గిరి గుట్ట సగర (ఉప్పర) సంఘం అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ గాంధీ మాట్లాడుతూ సగర (ఉప్పర) సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీల‌లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీల‌ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, జగద్గిరిగుట్ట సగర (ఉప్పర )సంఘం నూతన అధ్యక్షుడు వేముల సుదర్శన్ సాగర్ , ప్రధాన కార్యదర్శి భీమయ్యా సాగర్, కోశాధికారి వెంకట రమణ , స్టీరింగ్ సభ్యులు రాములు, శ్రీనివాస్, సత్యనారాయణ, గంగాధర్, దయాసాగర్, రామకృష్ణ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, బాల్ రాజు, కృష్ణ మురళి, చంద్రశేఖర్, వెంకటేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here