శేరిలింగంపల్లి, జనవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పీజేఆర్ రోడ్డు అపార్ట్‌మెంట్, కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పట్టించుకోవాలని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి డిమాండ్ చేశారు. చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్ , KSR ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు, గ్రీన్ ఫీల్డ్స్, అపర్ణ అపార్ట్మెంట్ వాసులతో కలిసి PJR రోడ్ ను బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న అపార్ట్మెంట్, కాలనీ వాసులకు రోడ్లు, డ్రైనేజీల సమస్య పరిష్కారం చేయలేరా అని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా తల్లులు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్డు ఎక్కిన విషయం గాంధీకి కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు.

మాకు ఫ్యూచర్ సిటీ వద్దు, ఉన్న సిటీ లో మౌలిక సదుపాయాలు అందించండి మహా ప్రబో అని రోడ్డు ఎక్కి ప్రజలు నిలదీస్తున్నది వినబడుతుందా..? అభివృద్ధి అనేది మాటల్లో ఉంది చేతల్లో లేదని ప్రజలు నిలదీస్తున్నారు. వేలాది మంది ప్రజలు తిరుగుతున్న PJR రోడ్డులో కనీస సౌకర్యాలు నెరవేర్చి ప్రజల డిమాండ్ కు తలవొగ్గి సమస్యలు పరిష్కరించాలి.. అని నవత రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, చందర్ రావు, గౌస్, శ్రీనివాస్(బబ్లూ) ,J.V.రావు, గణేష్ రెడ్డి, శోభ, చక్రవర్తి, రాజు, గంగాధర్, నగేష్ రెడ్డి, ఉపేందర్, వంశీ, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, సునీత, శబనా, బాబా, అనంత రెడ్డి, మానస తదితరులు పాల్గొన్నారు.





