జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హఫీజ్ పేట్ డివిజన్ లో బీజేపీ విజయం ఖాయం: రవి కుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్‌లో ప్రజయ్ సిటీ శ్రీ సత్యభారతి ఫంక్షన్ హాల్ లో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేవాన్ని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలం బూత్ స్థాయి కార్యకర్తల నుంచే వస్తుంద‌ని, ప్రతి బూత్‌ను సంస్థాగతంగా మరింత పటిష్టం చేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాల‌ని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాల‌న్నారు. క్రమశిక్షణ, ఐక్యత, అంకితభావంతో పనిచేస్తే శేరిలింగంపల్లి అసెంబ్లీ, హఫీజ్ పేట్ డివిజన్ లో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ , కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి బూత్ స్థాయి నుంచే బలమైన వ్యవస్థ అవసరం, ప్రతి కార్యకర్త ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేయాలి, కార్యకర్తల శ్రమ, సమిష్టి కృషితో శేరిలింగంపల్లిని అభివృద్ధి, ప్రగతి మార్గంలో ముందుకు తీసుకెళ్లగలం, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ గెలుపు సాధిస్తాం అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు మూల‌ అనిల్ గౌడ్, జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్, డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, దేవాల్ యాదవ్ , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీధర్ రావు , రవి గౌడ్ , ఆళ్ల వర ప్రసాద్ , అసెంబ్లీ ఓబీసీ మోర్చా కన్వీనర్ పృథ్వీకాంత్ గౌడ్ , నాయకులు సత్యనారాయణ రాజు , ఎన్. విష్ణు , పవన్ , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , శివ , డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్ , రాజు , నాయకులు శ్రీనివాస్ యాదవ్ , అశోక్ , సుబ్బారావు , సుభాష్ , ఎమ్.పి. కుమార్ , రాజు యాదవ్, రవి ముదిరాజ్ , పి . శ్రీనివాస్ , డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల‌ , ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ , ఓబీసీ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ , ఓబీసీ మోర్చా డివిజన్ కోశాధికారి పవన్ కుమార్ , బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు , ఉపాధ్యక్షుడు వినయ్ , మహిళా నాయకురాలు పావని , నాయకులు రాజకుమార్ , రాంరెడ్డి , ప్రభాకర్ రెడ్డి , దేవేందర్ రాజు , రామ్మోహన్ , శేఖర్ ముదిరాజ్ , దత్తాత్రేయ, వివిధ మోర్చాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here