ఆలిన్ వ‌న్ స్టడీ మెటీరియ‌ల్‌ను విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని జడ్.పి. హైస్కూల్, మక్తా మహబూద్ పేట్ ఎంపిపి పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థిని విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో త‌యారు చేయించిన ఆలిన్ వ‌న్ స్ట‌డీ మెటీరియ‌ల్‌ను బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, ట్రస్ట్ సెక్రటరీ, ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు నిపుణుమైన ఉపాధ్యాయుల సలహాలు సూచనలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. విద్యార్థులు ఈ మెటీరియ‌ల్‌ను సద్వినియోగపరచుకుని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాలి రెడ్డి , శ్రీకాంత్, నాయకులు నాగేశ్వర్ గౌడ్, ఆకుల లక్ష్మణ్, మాణిక్ రావు, మనోహర్, రవి గౌడ్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, పట్టాభిరామ్, పద్మ, రెడ్డెమ్మ, సురేష్ , శ్రీనివాస్, విజయేందర్, శివరాజ్, రాము, శివారెడ్డి, భాషా శివ, పవన్, నాగులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here