నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ గేటెడ్ కమ్యూనిటీ లో వంద శాతం వాక్సినేషన్ పూర్తి కావడంతో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సరోవర్ అధ్యక్షుడు నాగరాజుకి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలు ముందుకు రావాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అపర్ణ సరోవర్ అధ్యక్షుడు నాగరాజు, గోపనపల్లి వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు ప్రకాష్, ఎస్ ఆర్ పీ భరత్, సూపర్ వైజర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.
