స్త్రీ త‌న‌ను తాను సంస్క‌రించుకోవాల‌నే సందేశాన్నిచ్చే గోగ్ర‌హ‌ణం నాట‌కం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: పితృస్వామ్య వ్యవస్థలో, పురుషాధిక్య సమాజంలో స్త్రీకి పవిత్రమైన హింసకు , న్యాయమైన దాస్యానికి బల‌వుతున్న స్త్రీ త‌న‌ను తాను సంస్క‌రించుకోవాల‌నే సందేశాన్నిస్తూ గో గ్ర‌హ‌ణ నాట‌కం ద్వారా అంద‌జేస్తున్న‌ట్లు నాట‌క ద‌ర్శ‌కులు ర‌మేష్ సింధే పేర్కొన్నారు. ప్ర‌ముఖ సినీన‌టులు, క‌వి త‌నికెళ్ల భ‌ర‌ణి ర‌చించిన గోగ్ర‌హ‌ణం నాట‌కాన్ని ఆదివారం సాయంత్రం ఉప్ప‌ల్ లోగ‌ల మినీ శిల్పారామంలో సుర‌భిక‌ళాకారుల‌చే ప్ర‌ద‌ర్శించారు. సురభి కళాక్షేత్రం తరపున నిర్వహిస్తున్న వీకెండ్ థియేటర్ వర్క్ షాప్ లో పాల్గొన్న సురభి యువత నాట‌కాన్ని ప్రదర్శించారు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ‌, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ, శిల్పారామం వారి సౌజన్యంతో సురభి కళాక్షేత్రమ్ వారి సమర్పణలో ఉప్పల్ మిని శిల్పారామం లోని యాంపీ థియేటర్ లో ప్రదర్శించారు. మంచి సందేశంతో కూడిన నాటిక ప్ర‌ద‌ర్శ‌న వీక్ష‌కుల‌ను ఆసాంతం ఆక‌ట్టుకుంది.

గోగ్ర‌హ‌ణం నాట‌కంలో సుర‌భి క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌

ఈ సంద‌ర్భంగా నాట‌క ద‌ర్శ‌కులు ర‌మేష్ సింధే మాట్లాడుతూ న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి…. స్త్రీ స్వాతంత్రానికి తగదు అనేలా నాటి నుండి నేటి వరకు స్త్రీల పరిస్థితి భూమి గుండ్రంగా ఉందన్నట్టే ఉంద‌ని, ఆలిగా, అమ్మగా, చెల్లిగా, అక్కగా, అధికారిణిగా… ఇలా ఎన్ని పాత్రలు పోషించినా అవసరాల బానిసత్వంలో చేతకాని వ్యక్తిగానే స్త్రీ మిగిలిపోతుంద‌న్నారు. చట్టాలు, న్యాయాలు స్త్రీల‌ను అబలవంటూ వెక్కిరిస్తున్నాయ‌ని, ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు త‌మ‌ను తాము సంస్క‌రించుకుంటే తప్ప‌ ఈ బానిస సంకెళ్ల నుంచి విముక్తి దొరకద‌నే సందేశాన్ని త‌నికెళ్ల‌భ‌ర‌ణి చ‌క్క‌గా నాట‌క ర‌చ‌న‌లో వ్య‌క్త‌ప‌రిచార‌ని అన్నారు. ఈ నాటకానికి సహకారం సురభి సంతోష్ సంగీత సహకారం, డా.రమేష్ సింధే, సత్యశ్రీనాథ్, ఆనంద్, లైటింగ్ అండ్ సెట్టింగ్, సురభి ఉమా శంకర్ బృందం మేకప్ ఎ.రాఘవేంద్రరావు, కాస్ట్యూమ్స్ ఫణిభూషణ్ బృందం స‌హ‌క‌రించ‌గా క‌ళాకారిణులు వి. అనురాధ, సురభి దీప్తి, వి.వీణ, వి తన్మయి, వి.జాహ్నవి, వి చిరంజీవి, ఎ. రాఘవేంద్రరావు, వి సాయి శుభకర్, ఎమ్ సాయి, ఆర్. వంశీ, ఎ. సందీప్, వి.సాయిరోహిత్ పాత్రలు పోషించారు.

గోగ్ర‌హ‌ణం నాట‌కంలో సుర‌భి క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here