నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన పద్మన్ బలంగా 75 ఏళ్ల వయస్సు గల వృద్ధుడు రాయదుర్గంలోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి టీ తాగడానికి బయటకు వెళ్లాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన పద్మన్ బలంగా తిరిగి రాలేదు. తప్పిపోయిన వ్యక్తి ఒడియా, తెలుగు భాషల్లో మాట్లాడగలడని తెలిపారు. ఆచూకీ లభిస్తే ఎస్ఐ సతీష్ 7901150218, రాయదుర్గం పోలీస్ స్టేషన్ 8331013199 కు సమాచారం ఇవ్వగలరని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.