నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ -20 కార్యాలయంలో ఏఎంఓహెచ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నగేష్ నాయక్ కు టీఎంఈడబ్ల్యుఏ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. బదిలీపై వచ్చిన నగేష్ నాయక్ కు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేశారు. టీఎంఈడబ్ల్యుఏ గ్రేటర్ ఉపాధ్యక్షుడు జలంధర్ రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు నాగేశప్ప, యూనియన్ సలహాదారుడు కిష్టప్ప, భరత్ రెడ్డి, బాల్ రాజ్, రాజయ్య, కృష్ణ, ఉపాధ్యక్షుడు అచ్యుత్, జోనల్ ప్రెసిడెంట్ నారాయణ స్వామి నాయక్, శేరిలింగంపల్లి సర్కిల్ సహాయ కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్, కోశాధికారి రాజేష్ యాదవ్, నిర్వాహక అధ్యక్షుడు ఎం.డి జిలాని, ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, జోన్ సహాయ కార్యదర్శి కృష్ణం రాజు, శ్రవణ్, సుధీష్, అనిల్, హరీష్, విజయ్, పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
