నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి రూ. 3.5 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ గౌస్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలేష్, మనుఫ్ ఖాన్, ఖాసీం, లియాకత్, రహీం, రెహ్మాన్, బాబూమియా, సలీం, షోయబ్, శంకర్, మియన్, ఆంజనేయులు గౌడ్, కృష్ణ యాదవ్, శ్యామ్, గణేష్ యాదవ్, సురేందర్ గౌడ్, లాలూ నాయక్, హున్య నాయక్, సాంబయ్య, నర్సింహ, పూరీయే నాయక్, లక్ష్మణ్, రాములు, సాజిద్, మహమ్మద్ ఖాజా,షేక్ ఖాజా, లోకేష్, రాజు, మహమ్మద్, రామచందర్, రామకృష్ణ, అంకా రావు, మున్నీర్, ఆఫ్రోజ్, సుబ్రమణ్యం, లోకేష్, శ్రీనివాస్ గుప్త, స్వామి, కృష్ణ ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, మహేష్, రవి, వినోద్, విజయ్ రామ్, సూర్య చందర్, ఉన్నూర్, సుబ్బరావు, సోమేశ్వర రావు, వెంకట్రామిరెడ్డి, డాక్టర్ ప్రసాద్, సూర్యనారాయణ, సుభాష్, ఉదయ్, శ్రవణ్, మోహన్ రావు, ఓ.కృష్ణ, నారాయణ రెడ్డి, సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్, ప్రభాకర్, ప్రకాష్ రెడ్డి, శ్రీను, వెంకట్ రావు, రాజేష్, మల్లారెడ్డి, వీరా రెడ్డి, మహిళలు పితని లక్ష్మీ, శ్రావణి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.