బెల్ యాజమాన్యం పట్ల విప్ గాంధీ తీవ్ర అసంతృప్తి – ఎంఐజీలో అక్రమంగా బోర్డులు పెట్టిన బెల్ అధికారులు – అడ్డుకున్న కార్పొరేటర్ సింధు, విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో గత 35 సంవత్సరాల క్రితం ఏర్పడిన హెచ్ ఎం డీ ఏ అఫ్రూవ్డు లే ఔట్ లో నివాసం ఉంటున్న బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల మధ్యలో, రోడ్ల మధ్యలో, పార్కు స్థలాల్లో బెల్ అధికారులు అక్రమంగా బోర్డులు పెట్టి స్వంత సంస్థ వారే మోసపూరితంగా వారి పూర్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. భారతినగర్ డివిజన్ పరిధి లోని ఎం.ఐ. జి కాలనీ లో భేల్ అధికారులు దౌర్జన్యంగా అక్రమంగా థీమ్ పార్క్ స్థలంలో, ఇండ్ల మధ్య, రోడ్ల బెల్ బోర్డులు పెట్టిన విషయం తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు ,కాలనీ వాసుల తో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సంఘటన స్థలానికి చేరుకొని కాలనీ వాసులకు అండగా నిలబడ్డారు. కాలనీ వాసులెవరూ అదైర్యపడవద్దని తాము అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోకూడదనే ఉదేశ్యం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెల్ సంస్థ కు 100 కోట్ల విలువ గల పనులు అప్పగించడం జరిగిందన్నారు. సంస్థ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఎంఐజీలో నివసిస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు‌. గతంలో జోనల్ కమిషనర్లు, అధికారులను పిలిపించి సరైన పద్దతి కాదని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. బెల్ సంస్థ వ్యవహరించిన తీరు పట్ల ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తీవ్రంగా ఖండించారు. అక్రమంగా బోర్డులు పెట్టరాదని సూచించారు. డివిజన్ లో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కల్పించరాదన్నారు. త్వరలోనే ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, కాలనీ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఢిల్లీ లోని యాజమాన్యం దృష్టికి, ఈడీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. స్థానిక అధికారులు చేస్తున్న పరిణామాలను వివరించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బూన్, సర్కిల్ సెక్రటరీ భాస్కర్ ముదిరాజ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, తిలవాత్, సంపత్ గౌడ్, సురేందర్, బబ్బి, డైరెక్టర్లు, కాలనీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎంఐజీ కాలనీలో కార్పొరేటర్ సింధు రెడ్డితో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here