శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000-2001 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్ లోని అతిధి బాంకెట్ హాల్ లో నిర్వహించారు.24 ఏళ్ల కిందట చదువుకున్న విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకున్నారు. వివిధ ప్రాంతాలలో స్థిర పడిన వారంతా వచ్చారు. ఈ సందర్బంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడి పాడారు. ఈ పాతికేళ్లలో జీవన పోరాటంలో విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు బాధ్యతల్లో మునిగి తేలే ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒకరోజుని మరలా మిత్రులు, ఉపాధ్యాయులతో గడిపి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మావతి, స్వర్ణ లీలా,రామలింగ రాజు, శ్యామల దేవి, విజయమ్మ, ఈశ్వరమ్మ,కృష్ణా రెడ్డి, సౌభాగ్య లక్ష్మి,పూర్వ విద్యార్థులు సోమేశ్, భూపతి, వి.రవి,రాజు,ఆర్.రమేష్, మహేష్,సాద నరేష్, సురేందర్, సతీష్, నాగరాజు,లక్ష్మి,ఫాహీమ, ఆర్తి కౌర్,వసంత, జ్యోతి, ప్రతిభ, పద్మ తదితరులు పాల్గొన్నారు.