శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 60 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.24,12,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలోనాయకులు సంజీవ రెడ్డి ,ఉట్ల కృష్ణ, దొడ్ల రామకృష్ణ గౌడ్, పురెందర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్,చిరుమూర్తి రాజు, సుబ్బయ్య యాదవ్, శేఖర్, ఎర్రనర్సయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.