శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీలు, క్రియాశీల సభ్యత్వాలపై ఇంచార్జి సుభాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ సమక్షంలో కొండాపూర్ మసీదు బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ సూచించిన పలు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ సూచన మేరకు తేదీ డిసెంబర్ 20 లోపు అన్ని డివిజన్లలో మొత్తం 622 బూత్‌లకు గాను కమిటీలను వేసి నిర్ణయించిన తేదీలోగా రాష్ట్ర పార్టీకి నివేదిక అందించి, రానున్న డివిజన్ అధ్యక్షుల నియామకం క్రియాశీల సభ్యులకు సంబంధించిన పలు విషయాలు సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, అశోక్ కురుమ, మని భూషణ్, రామరాజు, మైపాల్ రెడ్డి, బసంత్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, ఆంజనేయులు సాగర్, కృష్ణ ముదిరాజ్, రాజు శెట్టి, మాణిక్ రావు, నర్సింగ్ రావు, మనోహర్ గౌడ్, జితేందర్ పాల్గొన్నారు.