బీసీలు అంద‌రూ ఏక‌తాటిపై న‌డ‌వాలి: భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత యాదవ మహాసభ నూతన రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ ని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఘనంగా సన్మానించారు. మలక్ పేటలో ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన చింతల రవీందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాదవ సంఘాలను బలోపేతం చేసి సర్పంచులు, ఎంపీటీసీలు, జిహెచ్ఎంసి కార్పొరేటర్, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో అత్యధికంగా యాదవులు, బీసీల‌ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం మనది అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిని చైతన్యం చేస్తూ ఏకతాటిపై నడిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సందర్భంగా శాలువాతో పూల బొకేతో ఘనంగా సన్మానించారు.

చింతల రవీందర్ యాదవ్ కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చేగొండ రాజన్న యాదవ్, సాయన్న, వెంకట్, ఇజ్జగిరి మధుకర్, రాజేష్ యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొని చింతల రవీందర్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here