శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు జూనియర్ కాలేజీలపై చర్య తీసుకోవాలని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్ సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల ప్రాంతంలో పుట్టగొడుగుల్లా జూనియర్ కాలేజీలు వెలుస్తున్నాయని, ఇంటర్మీడియట్ విద్యా మండలి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నారని అన్నారు.

మొదట్లో తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్స్ తీసుకొని క్లాసులు నిర్వహిస్తున్నారని, కానీ పరీక్షలు దగ్గరికి వస్తున్న వేళ తల్లి తండ్రులను చదువుతున్న విద్యార్థులకు ఏ కాలేజీ నుండి హాల్ టికెట్ వస్తుందో తెలియదని, అసలు హాల్ టికెట్ వస్తుందో లేదో ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇలా పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల వలన అటు తల్లిదండ్రులు ఇటు చదువుతున్న విద్యార్థులు అందరూ ఇక్కట్ల పాలవుతారని అన్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు విద్యార్థులకు నష్టం జరగకుండా బాధ్యత వహించాలని, అదేవిధంగా పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న అన్ని జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన రంగారెడ్డి జిల్లా డిఐఓ వెంక్య నాయక్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి పాల్గొన్నారు.