శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతాజీ నగర్ కాలనీ బీసీ ఐక్యవేదిక ముఖ్య కార్యాలయంలో పండుగ సాయన్న వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, జాతీయ యువత అధ్యక్షుడు కిరణ్ కుమార్ , ముదిరాజ్ మహాసభ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ ముదిరాజ్ , తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ పండుగ సాయన్న పేదల కోసం సేవ చేయడం, కందుల ద్వారా పేదలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, పేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు సహాయం చేస్తూ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరిస్తూ పనిచేయడం గొప్ప విశేషమని అన్నారు. బీసీలందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సహకారంతో భోజన రాజ్యాధికారం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఐక్యవేదిక ఆర్గనైజ్ సెక్రెటరీ హరికృష్ణ చారి, సైదులు, బి సాయిలు యాదవ్, రమేష్ ముదిరాజ్, మధు ముదిరాజ్ , బేరి చంద్రశేఖర్ యాదవ్, మనోజ్ కుమార్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, బీసీ సంఘం నాయకులు, యూనివర్సిటీ శివ ముదిరాజ్, జాతీయ యువత అధ్యక్షుడు కిరణ్ కుమార్ పాల్గొన్నారు.





