శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలో రెండు వేరువేరు ఘటనలకు చెందిన బాధిత కుటుంబాలను యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ పరామర్శించారు. మియాపూర్ FCI కాలనీకి చెందిన రాజేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న వెంటనే, ఉదయ్ కిరణ్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాజేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అవసరమైన సాయం అందిస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అదే విధంగా, మియాపూర్ కృష్ణ సాయి అపార్ట్‌మెంట్‌కి చెందిన పెనుగొండ నవీన్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో, ఉదయ్ కిరణ్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉదయ్ కిరణ్ వెంట శరత్, కృష్ణ, వంశీ, రత్నాచారి, ప్రవీణ్, వినోద్, వాసు, సతీష్, వినయ్ ఉన్నారు.






