పిల్లల‌కు చదువులతోపాటు ఆటలు చాలా కీలకం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మానియా- 2025 కార్యక్రమాన్ని MEO వెంకటయ్య, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా మహోత్సవం (స్పోర్ట్స్ మానియా) నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అని అన్నారు. పిల్లల‌కు చదువులతోపాటు ఆటలు చాలా కీలకం అని , పిల్లలలో దాగిన సృజనాత్మకతను బయటకి వెలికి తీయడానికి ఎంతగానో తోడ్ప‌డుతుంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి స్పోర్ట్స్ మేనియా 2025 చీఫ్ అడ్వైసర్ లయన్ డా.వెంకటేశ్వర రావు, అధ్యక్షుడు పవన్ కుమార్, సెక్రటరీ పి.త్రిమూర్తులు, కోశాధికారి, సలీం, కన్వీనర్ ఎన్ ఎస్ రావు, కో కన్వీనర్ నరేంద్ర బాబు, ట్రేసమా స్టేట్ ప్రెసిడెంట్ S.N. రెడ్డి , సెక్రటరీ అనిల్ కుమార్, రాజేశ్వర రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here