శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పకళా వేదికలో ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణం సమాచార, పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రజా వ్యవహారాల సలహాదారు కే కేశవ రావు, ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, విద్యాశాఖ సంబంధిత అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువగా నేర్చుకునేది గురువుల నుండి అని, మన జీవన ప్రయాణానికి దిశానిర్దేశం చేసే గురువులు సమాజ నిర్మాణానికి శిల్పులని అన్నారు. మన ప్రేరణాత్మక సేవా దృక్పథం ప్రజల పట్ల చూపుతున్న కృతనిశ్చయం, గురువుల త్యాగమయమైన ఆత్మను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవం రోజున ప్రతి గురువుకి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు.





