ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఉపాధ్యాయ దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో టీచ‌ర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రదీపనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్‌సీయూ సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ పూర్వ అధ్యక్షుడు, ఆచార్య మీనా హరిహరన్ హాజ‌రై శేరిలింగంపల్లి మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, గురుకుల కళాశాలల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలలో పనిచేస్తున్న 35 మంది అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని బిల్డర్, సోషల్ వర్కర్ తూనిక రాఘవేంద్రరావు సౌజన్యంతో నిర్వహించారు.

అనంతరం ఆచార్య మీనా హరిహరన్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి అధ్యాపక వృత్తి అని అన్నారు. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాతి స్థానం గురువుదే అని పేర్కొన్నారు. గురువు తన శిష్యులలో చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించి వారి ఉజ్వల భవిష్యత్తుకై నిరంతరం శ్రమిస్తుంటార‌ని, మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటానికి విద్యయే ప్రధాన కారణమ‌ని, సమాజంలో వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులందరరూ గురువు అడుగుజాడలలో నడిచిన వారేన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్ర రెడ్డి, మండల విద్యాధికారి వెంకటయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు రాములు, బసవలింగం, తాజ్ బాబు, వసుంధర, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, G. V. రావు, శివరామకృష్ణ, బాలాజి, విష్ణు ప్రసాద్, ఖాదర్ మొయినుద్దీన్, సత్యవాణి, వరలక్ష్మి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here