శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హై టెన్షన్ లైన్ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావుతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మరిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొణిదేన కృష్ణ రావు, విజయ లక్ష్మి, రామచంద్రన్, పవన్ కుమార్, సురేంద్ర బాబు, రాంబాబు, మల్లికా, ఉమ, సంతోష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.