శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని గుర్నాథ్ చెరువులో స్వచ్ఛంద సేవకులు పర్యావరణ సేవలో భాగంగా పూర్తిగా చెత్తతో నిండిపోయిన వినాయక నిమజ్జను కొలనును పూర్తిగా శుభ్రపరచారు. చెరువులో అందరు వ్యక్తులు తీసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి చెరువు చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి దాదాపు 40 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ చుట్టుపక్కల నివసించే ప్రజలు కొందరు పూజా సామాన్లు, చెత్తాచెదారం లాంటివి వేస్తున్నారని, వారికి అవగాహన కల్పించడానికి గతవారం ప్రదర్శన కూడా చేశామని, అయినప్పటికీ ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక కాలనీ అపార్ట్మెంట్ వాసులకు చెరువుల్లో గానీ, చెరువు పరిసర ప్రాంతాల్లోగానీ చెత్త, ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ పర్యావరణానికి హాని చేసే వాటిని వెయ్యకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ వాసులు, చెరువు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న అపార్ట్మెంట్ కాలనీవాసులు దాదాపు 60 మంది స్వచ్ఛందంగా పాల్గొని కొలనును శుభ్రం చేశారు.






