శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ఉత్సవానికి టెక్స్టైల్స్ , అగ్రికల్చర్ , మార్కెటింగ్ , కోఆపరేటివ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన డప్పు వాయించి ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, వీవర్ సర్వీస్ సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. మేళా కోసం ఏర్పాటు చేసిన చేనేత కళాకారుల స్టాల్ల్స్ ను కలియతిరిగి చూశారు. వారితో మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలన చేసి కళాకారుల నృత్య ప్రదర్శన తిలకించారు. హైదరాబాద్ అస్సాం అసోసియేషన్ సంగీతం, బిహు నృత్యాలు , హాంగ్ కాంగ్ నుండి విచ్చేసిన ఆంధ్రనాట్యం కళాకారులు సంజయ్ వాడపల్లి బృందం ఆగమ నర్తనం, కుంభహారతి, పుష్పాంజలి, శివ కైవారం, ఆధ్యాత్మ రామాయణ కీర్తన, సీత స్వయంవరం, నవజనార్ధన పారిజాతమ్ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. వరంగల్ నుండి విచ్చేసిన కళాకారులు శంకరాదిత్య, వేదశ్రీ కర్ణాటక గాత్ర కచేరి అలరించింది.






