మియాపూర్ చౌర‌స్తాలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ చౌరస్తాలోని ట్రాఫిక్ సమస్య వల్ల చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బొల్లారం, బాచుపల్లి నుండి వచ్చే వాహనాలను కచ్చితంగా ఎడమ వైపు వెళ్లే విధంగా మళ్లించాలని, దీనివల్ల ప్రజల‌కు ట్రాఫిక్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని, దీనికి తగిన చర్యలు తీసుకోవాల‌ని కోరుతూ మియాపూర్ ట్రాఫిక్ సిఐని కలిసి ప‌లువురు బీజేపీ నాయ‌కులు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, రవి గౌడ్, ప్రభాకర్, అభిరామ్, నల్లూరి పట్టాభిరామ్, మత్తా విలేజ్ గణేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here