శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మిట్ట కంకల్ గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రావుల గోపాల్ కుర్మా, ఉప సర్పంచ్ మొర్రి బందయ్య, వార్డ్ మెంబర్లు బేరి సత్యనారాయణ, రావుల సుమతన్న, చాకలి లక్ష్మయ్య, మొర్రి శ్రీనివాస్, రావుల రాములమ్మ, రావుల మనీష్ కుమార్, మొర్రి ఆండాళ్లును గ్రామవాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ ముర్రి శ్యాం కుమార్, మాజీ డిఎస్పి బంటు రాములు, వెంకట్ రెడ్డి, జక్రియ భాయ్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచిన వారందరూ ఐక్యమత్యంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.






