శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గోపీనగర్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 డిసెంబర్ 1924లో గ్వాలియర్ ప్రాంతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాజ్ పేయి జన్మించారని అన్నారు. అయిన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ అణు పరీక్షలు చేశారని, భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, గంగరాజు, రంగనాయకులు, రమేష్ చౌదరి, నారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.






