శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో మదీనాగూడ గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద భారతరత్న , మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కైతాపురం జితేందర్, బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ యాదవ్ , అజిత్ సేనాపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, సమగ్ర పాలన, అచంచలమైన దేశభక్తికి నిదర్శనమైన అటల్ జీవితం మనందరికీ మార్గదర్శకం. ఆయన దూరదృష్టి, ఆదర్శాలు నిరంతర ప్రేరణనిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, అజిత్ సేనాపతి, కోటేశ్వరరావు , మాజీ కౌన్సిలర్ రమణయ్య, శ్రీధర్ రావు , బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , మారెళ్ల వెంకటేశ్వర్లు , జగన్ గౌడ్ , శివాజీ , సురేష్ కురుమ , విష్ణు , బాబు రెడ్డి, పవన్, రాజు ముదిరాజ్, నవీన్, రాజు యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, నర్సింహా యాదవ్, రమేష్ యాదవ్ , కుమార్ కురుమ , శ్రీనివాస్ , రామ్ మోహన్, శేఖర్, రామ్ చంద్ర యాదవ్, రామ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అనిల్ , వినయ్ పాల్గొన్నారు.





