శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ డి. శశి రేఖ, రెవెన్యూ ఏఎంసీ మణికరణ్, ఏసీపీ నాగిరెడ్డి, ఏఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ రవి, ఇంజినీరింగ్ సెక్షన్ శ్రీదేవి, ఎంటమాలజీ విభాగం ఆర్.చిన్నా, యూబీడీ విభాగం సమీర, ఎలక్ట్రికల్ సెక్షన్ లక్ష్మీప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు 6 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్‌లో 2, రెవెన్యూ విభాగంలో 1 మొత్తం 9 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. వెంటనే సదరు ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి డీసీ శశిరేఖ ఆదేశాలు జారీ చేశారు.






