శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలోని పలు కాలనీలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వాలా హరీష్ రావు జాతీయ జెండాలను ఎగురవేశారు. మదీనాగూడలోని రామకృష్ణ నగర్, నైమిష అపార్ట్మెంట్, మదీనా ఉర్దూ స్కూల్ తో పాటు పలు ప్రదేశాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం పోరాడిన సమరయోధులను ఈ సందర్బంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బాబు మోహన్ మల్లేష్, గణేష్ రెడ్డి, కృష్ణ, రాము, ఉమా మహేశ్వర్ రావు, పృథ్వి, సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, రంగారావు, భాను, రాజు తదితరులు పాల్గొన్నారు.






