శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో PAC చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్ధులకు ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా స్టడీ కిట్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు.






