తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి: ఆర్.కృష్ణయ్య

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ల‌క్డీకాపూల్‌లోని అశోక హోటల్ ల్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, 130 బిసి కుల సంఘాలతో భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకోమని, స్థానిక సంస్థ ఎన్నికల్లో లీగల్ గా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో మాకు బిచ్చం వద్దు, మాకు న్యాయం కావాలని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. పార్టీలపరంగా రిజర్వేషన్ కల్పిస్తే రాష్ట్రంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నవంబర్ రెండో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రథయాత్ర ప్రారంభిస్తామని తెలియజేశారు. బీసీ సంఘాలు ఏకమై ఐకమత్యంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు వల్లేపు మాధవరావు, బీసీ సంఘాల నాయకులు గుజ్జ సత్యం, నాగరాజు, మణికంఠ, బాబు మోహన్ మల్లేష్, వంశీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here