శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో 3వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు పాల్గొని అన్నదానం చేశారు. పేద, అవసరమైన ప్రజలకు అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అట్టేపల్లి రామప్రభు తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






