భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, మాతృ శ్రీ నగర్ కాలనీలలో రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో UGD పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జిఎం హరిశంకర్, డిజిఎం నరేందర్, మేనేజర్ సలోమని, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here