కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి ‌కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు‌ వేడుకలను ముడు రోజుల పాటు‌ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్, మహేష్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, నాయకులు వెంకటేశ్వర్లు, చంద్రకళ, బసవయ్య, మహేందర్, లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, ఝాన్సీ, కల్యాణి, సుధారాణి, జయ, దీప, కుమారి, రామచందర్, పట్లోళ్ల నర్సింహా, ఆలీమ్, నర్సింహా, కుమార్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్ జీ కే సాయినాథుని ఆలయంలో‌ అన్నదానం చేస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here