ఈ శ్రమ్ కార్డుతో అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా వర్తింపు – బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ద్వారా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ నగర్ లేబర్ అడ్డా వద్ద ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ సెంటర్ ను రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డ్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు అని అన్నారు. కనీసం రూ. 15000 ఆదాయం మించని ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. అంగవైకల్యం కలిగితే లక్ష‌‌ రూపాయల బీమా వస్తుందన్నారు‌. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, రమేష్ రెడ్డి, మదనా చారి, నాగరాజు, శ్రీధర్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు.

ఈ శ్రమ్ కార్డులను అందజేస్తున్న రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here