నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్ రోడ్డు నంబర్ 1 లో రూ. 40 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. కాలనీ వాసులు కరెంటు స్థంబాలు కావాలని అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ తో మాట్లాడి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి, నర్సిరెడ్డి, క్రాంతి, రవి, వెంకటేశ్వర రావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
