నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ మాట్లాడడం అంబేద్కర్ అవమానించడమేనని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాఖ్యలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన బిజెపి భీం దీక్ష లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ అధ్యక్షతన బిజెపి భీం దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, కేసీఆర్ సీఎం కావడానికి కారణమైన రాజ్యాంగాన్ని మార్చాలనడం కేసీఆర్ దమననీతికి నిదర్శనం అన్నారు. దళిత, గిరిజన, బహుజన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న ప్రజా ఉపయోగ నిర్ణయాలతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. రాబోయే 2023 ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, శాసనసభా పక్ష నాయకులు రాజాసింగ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి డాక్టర్ ఎ. చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, రాష్ట్ర కార్యదర్శులు డా. ప్రకాశ్ రెడ్డి, మూగ జయశ్రీ, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, నగర కార్పొరేటర్లు, నాయకులు దీక్షలో పాల్గొన్నారు.