సృజనాత్మకత వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదం- ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదిన దినోత్సవం సందర్బంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీ, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, లక్ష్మి అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగ వల్లుల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. ముగ్గుల పోటీలకు జడ్జిగా టి. వరలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శివ రామకృష్ణ,ఉమ, చంద్రశేఖర్, కుమారి, పర్వీన్, జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here