ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం – గచ్చిబౌలి డివిజన్ లో ప్రభుత్వ విప్ గాంధీ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ, డాక్టర్ కాలనీ, డైమండ్ ఓక్ అపార్ట్మెంట్ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలలో ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. గుల్ మోహర్ కాలనీ, డైమండ్ ఓక్ అపార్ట్ మెంట్ మధ్య నెలకొన్న డ్రైనేజి అవుట్ లెట్ సమస్య ను పరిష్కరించడానికి డైమండ్ ఓక్ అపార్ట్మెంట్ వాసులకు నచ్చజెప్పి అండర్ డ్రైనేజీ పైప్ లైన్ వేసేందుకు మెప్పించారు. అపార్ట్మెంట్ వాసులు సుముఖత వ్యక్తం చేయడంతో డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందని అన్నారు. డాక్టర్స్ కాలనీ లో నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.

డాక్టర్స్ కాలనీలో వరద నీటి కాలువ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, కోటేశ్వరరావు, అరుణ, గుల్ మోహర్ కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసీం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగన్న, అడ్వైజరీలు జయరాజు సింగ్, ఎస్ కె రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, శేఖర్ రావు, మెంబర్లు మాధవరావు, విల్సన్, తారాసింగ్ నాయక్, అలీఖాన్, శ్రీనివాస్, నబిరాసుల్, చంద్రశేఖర్, శేషా సాయి తదితరులు పాల్గొన్నారు.

గుల్ మొహర్ కాలనీలో పాదయాత్ర చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here