సగర సంఘం అభివృద్ధికి కృషి చేస్తా – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సగర సంఘం భవనం నిర్మాణం త్వరలోనే చేపట్టడం జరుగుతుందని, భవన‌ నిర్మాణం పూర్తి కాగానే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధి అంజయ్య నగర్ లోని సగర సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సగర సంఘం భవనం మూడో అంతస్తు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ద్వారా రూ. 25 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంపిన ప్రతిపాదన పత్రాలను అంజయ్య నగర్ సగర (ఉప్పర) సంఘం సభ్యులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర సంఘం భవనం నిర్మాణానికి సీడీఎఫ్ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. నిధులు మంజూరు కాగానే భవన నిర్మాణాన్ని చేపట్టి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సగర సంఘం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ అడిగిన వెంటనే సగర సంఘం భవనం మూడో అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు సహకరించిన ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు అంజనేయులు సాగర్, రాష్ట్ర సగర సంఘం సంయుక్త కార్యదర్శి దామోదరయ్య సాగర్, రామ కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here