నమస్తే శేరిలింగంపల్లి:కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు హైదరాబాదులోని శేరిలింగంపల్లి మండలం, మాదాపూర్ ఖానామెట్ గ్రామంలో సర్వే నంబర్ 41/14 లో ఐదెకెరాల స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసిన శుభసందర్భంగా కమ్మ వారి సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ని బుధవారం హఫీజ్ పేట్ డివిజన్ మైత్రి నగర్ కాలనీ కాకతీయ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైత్రి నగర్ వాసులు ముప్పా సుబ్బయ్య, సుబ్బారావు, సుబ్రమణ్యం, ఆనంతయ్య ,వీరేంద్ర చౌదరీ, విశ్వేశ్వర రావు, రాంబాబు, రాధాకృష్ణ, కేవీ ప్రసాద రావు, మండవ రాంబాబు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.