నమస్తే శేరిలింగంపల్లి:కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన అజీమున్నిసా బేగం కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 25 వేల చెక్కును బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్,శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు,నాయి నేని చంద్రకాంత్ రావు, అల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.