చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 13 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాలయంలో సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్యక్ర‌మంలో డిప్యూటీ క‌మిష‌న‌ర్ డి.శ‌శిరేఖ‌, రెవెన్యూ సెక్ష‌న్ ఏఎంసీ మ‌ణిక‌ర‌ణ్‌, టీపీఎస్ ర‌మేష్‌, ఏఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ ర‌వి, ఇంజినీరింగ్ సెక్ష‌న్ ఇందిరా బాయి, ఎంట‌మాల‌జీ విభాగం ఆర్‌.చిన్నా, యూబీడీ సెక్ష‌న్ స‌మీర‌, ఎల‌క్ట్రిక‌ల్ సెక్ష‌న్ ల‌క్ష్మీ ప్రియ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌ర్కిల్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదుల‌ను ఆయా విభాగాల‌కు చెందిన అధికారుల‌కు అందజేశారు. ఈ క్ర‌మంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి 5, ఇంజినీరింగ్ 5, రెవెన్యూ 1, శానిటేష‌న్ 1, ఎల‌క్ట్రిక‌ల్ 1 మొత్తం క‌లిపి 13 ఫిర్యాదులు అందాయ‌ని అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని డీసీ శ‌శిరేఖ సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here