శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ పనిచేసే విధానం ఒక్కటే అని, ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి పనికి బాధ్యత వహించడం, వారి పనులను పూర్తి చేయడమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు. ప్రజలకు , ప్రతినిధులకు, నాయకులకు మంచి సఖ్యతా సంబంధాలను ఏర్పరచుకోవడం వలన వారి సమస్యలను, ఆలోచనలను, పరిష్కారాలను పంచుకోవడం సులభతరం చేసుకోవచ్చని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నలగండ్లలోని అపర్ణ జెనిత్ గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో 70కి పైగా గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కీర్తి రెడ్డితో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కష్టపడే కుటుంబాలు, నిపుణులు, పన్ను చెల్లింపుదారులతో నిండిన ప్రాంతమని, తాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం చూస్తూ పెరిగానని, ఇక్కడ నివసిస్తున్న ప్రజలను, వారి సంస్కృతులను తాను అర్థం చేసుకుని గౌరవిస్తానన్నారు. ప్రజలు తమ నుండి ఆశించేది ప్రజల సమస్యలపై త్వరగా స్పందన అని, పనిలో స్పష్టత, అవసరమైనప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ తాను అదే పద్ధతిని అనుసరిస్తానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటానికి తమ బృందం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తమ ఆలోచన చాలా స్పష్టంగా ఉందని అన్నారు. నిజాయితీ పన్ను చెల్లింపుదారులు, బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే వికసిత భారత్ నిర్మించబడుతుందని అన్నారు. బీజేపీ పనిచేసే విధానం ఒక్కటే అని, అందుబాటులో ఉంటామని, బాధ్యత వహించడం, పనులు పూర్తి చేయడం, తమ మీద నమ్మకం ఉంచి, ప్రజలు వారి సమస్యలను తమతో చెబితే తాము ప్రజలకు అండగా ఉంటామని తాను హామీ ఇస్తున్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలు కమ్యూనిటీల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





